![]() |
![]() |

ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం చాలామంది పడిగాపులు పడుతున్నారు. సెలబ్రిటీస్ అంతా కూడా ఆ బ్లూ టిక్ కోసం కలలు కంటూ చాల హార్డ్ వర్క్ చేస్తున్నామని చెప్తూ డాన్స్ లు, ఫోటో షూట్ లు, ఆస్క్ మీ క్వశ్చన్స్, లైవ్ వీడియోస్ పేరుతో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో తలమునకలవుతూ ఉండగా మరో వైపు ఇన్ స్టాగ్రామ్ లో 699 కడితే చాలు బ్లూ టిక్ ఆప్షన్ ఇచ్చేస్తుండడంతో సెలబ్రిటీస్ కి ఒళ్ళు మండిపోతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పటికే అఖిల్ సార్థక్ ఈ విషయం మీద ఫుల్ గరం ఐపోయాడు. ఇన్స్టాగ్రామ్ ని తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేసాడు.
ఇప్పుడు ఆ తిట్టే వొంతు గీతూ రాయల్ కి వచ్చింది. "నీ యవ్వా ఇన్స్టాగ్రామ్ సచ్చినోడా...ఎదవా...నిజమైన బ్లూ టిక్ వచ్చిన హ్యాపీనెస్ ని ఒక సంవత్సరం కూడా లేకుండా చేసావ్ కదరా...ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ బ్లూ టిక్కులు ఉన్నాయి. ఛ" అంటూ మాములుగా తిట్టడం లేదు...మరో వీడియోకూడా సైడ్ బై సైడ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒకతను డబ్బులు పెట్టి కొనుక్కుని నవ్వుకుంటూ ఉంటాడు మరో అమ్మాయి కష్టపడి వీడియోస్ చేస్తూ గోల్స్ రీచ్ అవుతూ ఫాన్స్ ని ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ సమానమైపోయారనే మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. గీతూ గురించి చెప్పాలి అంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. అసలు బిగ్ బాస్ సీజన్ 6 జనాలకు గుర్తున్నది అంటే కేవలం గీతూ రాయల్ వల్లనే అని కూడా చెప్పొచ్చు.

![]() |
![]() |